Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హత్య బెదిరింపులకు బెదరను.. చంపాలనుకుంటే చంపేయండి: హర్యానా బామ్మ

Tai Savitri Haryana grandmother responds to death threats over parenting videos
Advertisement
  • పేరెంటింగ్ పై వీడియోతో వైరల్ అయిన బామ్మ తాయ్ సావిత్రి
  • అభిప్రాయాలు నచ్చక కొందరి నుంచి హత్య బెదిరింపులు
  • చంపాలనుకుంటే చంపేయండి, వీడియోలు ఆపనంటూ ఘాటుగా స్పందన
  • పిల్లల మానసిక ఆరోగ్యం కోసమే తన పోరాటమని వెల్లడి
  • ఆమె వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన, కొందరి మద్దతు
Advertisement
సోషల్ మీడియాలో తాను చెప్పిన అభిప్రాయాలు నచ్చలేదని కొందరు హత్య బెదిరింపులకు పాల్పడటంపై హర్యానాకు చెందిన బామ్మ, కంటెంట్ క్రియేటర్ తాయ్ సావిత్రి ఘాటుగా స్పందించారు. పిల్లల పెంపకం, వారి మానసిక ఆరోగ్యంపై తాను చేస్తున్న వీడియోలను ఇలాంటి బెదిరింపులతో ఆపలేరని ఆమె స్పష్టం చేశారు. ప్రాణం పోయినా సరే, పిల్లల సంక్షేమం కోసం వీడియోలు చేస్తూనే ఉంటానని స్ప‌ష్టం చేశారు.

ఇటీవల ఆమె పోస్ట్ చేసిన ఒక వీడియోలో తన విమర్శకులను ఉద్దేశించి మాట్లాడారు. "చూడండి, నన్ను ఎవరైనా చంపాలనుకుంటే ముందుకు రండి, చంపేయండి. ఎలాగూ నాకు మిగిలింది నాలుగైదేళ్లే. ఎక్కువ సమయం లేదు. అయినప్పటికీ నేను ఈ వీడియోలు చేయడం ఆపను. పిల్లల మేలు కోసం ప్రతిరోజూ కంటెంట్ తయారు చేస్తూనే ఉంటాను" అని ఆమె సవాల్ విసిరారు. తనకు బెదిరింపులు పంపుతున్న వారికి మానసిక ఆరోగ్యంపై కనీస అవగాహన లేదని ఆమె విమర్శించారు.

కొంతకాలం క్రితం తాయ్ సావిత్రి చేసిన ఒక వీడియో తీవ్ర దుమారం రేపింది. "పిల్లలను పెంచడం వారికి మనం చేస్తున్న సాయం అన్నట్టుగా తల్లిదండ్రులు ప్రవర్తించకూడదు. ఎందుకంటే పుట్టాలని పిల్లలు ఎప్పుడూ అడగలేదు. వారిని ఈ లోకంలోకి తెచ్చినందుకు తల్లిదండ్రులే బాధ్యత వహించాలి" అని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు కొందరికి నచ్చకపోవడంతో ఆమెకు వ్యతిరేకంగా ట్రోలింగ్ మొదలైంది. అది కాస్తా హత్య బెదిరింపుల వరకు వెళ్లింది.

అయితే, ఈ బెదిరింపుల నడుమ తాయ్ సావిత్రికి మద్దతు కూడా వెల్లువెత్తుతోంది. ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ, వీడియోలు కొనసాగించాలని చాలా మంది సోషల్ మీడియా యూజర్లు కోరుతున్నారు. పిల్లల మానసిక ఆరోగ్యంపై ఆమె చేస్తున్న కృషిని అభినందిస్తున్నారు. 

మానసిక ఆరోగ్యంపై అవగాహన లేని వారికి తన సందేశం చేరేలా ఈ వీడియోను అందరూ షేర్ చేయాలని ఆమె తన ఫాలోవర్లను కోరారు. ఈ ఘటనతో ఆమెకు విమర్శలతో పాటు మద్దతు కూడా పెరుగుతుండటం గమనార్హం.
Advertisement
Advertisement
Tai Savitri
Haryana Grandmother
Parenting Advice
Mental Health Awareness
Death Threats
Content Creator

More Telugu News